నేటి ప్రపంచీకరణ యుగంలో.....ప్రపంచ దేశాల మధ్య వారధి ఇంగ్లీష్. ఉద్యోగ వేటలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. ఈ స్కిల్ సాధించిన వాళ్ళు....అవకాశాలను అందుకోవడంలో అందరికంటే ఒకడుగు ముందుంటారు.
టెక్నికల్ గా, సబ్జెక్టు పరంగా పర్ ఫెక్ట్ అయితే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది. అనే అపోహ చాలా మంది విద్యార్థులలో ఉన్నది.
వాస్తవ పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది.
ఉద్యోగం లో చేరాక బృందంతో కలిసి పనిచేయడం, క్లయింట్స్ తో మాట్లాడటం, ఆలోచనలు పంచుకోవడం, సమీక్షలు, భిన్న ప్రాంత వ్యక్తులను కలవడం, విదేశాల్లో పనిచేయడం ఇవన్నీ అనివార్యం.
వీటన్నింటికీ మంచి కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ కోసం అందరికీ ఆమోదయోగ్యమైన భాష....ఇంగ్లీష్.
అందుకే ఉద్యోగ వేటలో కోర్ సబ్జెక్టు లపై పట్టు ఎంత ముఖ్యమో...ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే అవసరం.
ఇంగ్లీష్ ఏమంత కష్టం కాదు :
చాలా మంది విద్యార్ధులు ఇంగ్లీష్ పై పట్టు సాధించడం కష్టంగా భావిస్తారు. అందుకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలను గుర్తించడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, తమ బలహీనతలను గుర్తించి....పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఇంగ్లీష్ పై పట్టు సాధించడం ఏమంత కష్టం కాదు. సాధించాలనే తపన ఉంటే...ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా తేలికే.
ఇవీ సమస్యలు :
1) సరిగా ఉచ్ఛరించలేకపోవడం
2) వ్యాకరణాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోవటం
3) సందర్భానికి తగ్గ పదాన్ని ఉపయోగించలేకపోవడం
4) సందర్భానుసారం ఉచ్ఛారణలో హెచ్చు తగ్గులు పాంటిచలేకపోవడం
5) స్పష్టంగా మాట్లాడలేకపోవడం
6) చదివినదాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవటం
7) రిపోర్టులను సరిగా తయారు చేయలేకపోవటం
8) సెమినార్లలో ప్రభావవంతమైన ప్రజెంటేషన్ లను ఇవ్వలేకపోవటం
9) స్ఠైర్యంగా ఇంటర్వూలను ఎదుర్కోలేకపోవటం
ఆసక్తి చాలా ముఖ్యం :
ప్రతి భాషలోనూ....వినడం, మాట్లాడటం, చదవడం, వ్రాయటం వంటివి కీలకం. వీటన్నింటిపై పట్టు సాధిస్తేనే భాషపై ప్రావీణ్యం వస్తుంది.
ఇంగ్లీష్ లో వొకాబులరీ, గ్రామర్, స్పెల్లింగ్ లు కూడా కీలకం. వీటిని నేర్చుకోవడంలోని మెలకువలను పుస్తకాలు, నిష్ణాతుల ద్వారా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గల అన్ని సందర్భాలను, అవకాశాలను వినియోగించుకోవాలి.
పలు అంశాలపై చర్చను కొనసాగిస్తూ ఉండాలి. భాషను నేర్చుకోవడంలోని మెలకువలు, భాషా నైపుణ్యాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. ఈ మెలకువల్లో ప్రభావవంతమైన వాటిని గుర్తించాలి. మీకు మీరుగా కొత్త కొత్త పద్ధతుల్లో భాషను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. వీలైనన్ని రకాలుగా మీ భాషా పాండిత్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అన్నిటికీ మించి నేర్చుకోవాలన్న ఆసక్తి, ఆకాంక్ష, శ్రద్ధ బలంగా ఉండాలి.
మాట్లాడటం, రాయడం :
గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, సెమినార్ ప్రెజెంటేషన్స్....వంటి వాటిల్లో ఉత్సాహంగా పాల్గొంటూ...తరచూ ఇంగ్లీష్ లో మాట్లాడటం ద్వారా మీ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు.
డైరీ వ్రాయటం, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, తరచూ ఈ మెయిల్స్ పంపిస్తూ ఉండటం, రిపోర్ట్ రైటింగ్...ఇలా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ మీ రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ ను మెరుగు పరచుకోండి.
చిట్కాలు :
న్యూస్ పేపర్, బుక్స్, డిక్షనరీ...ద్వారా వీలైనన్ని పదాలను నేర్చుకోవాలి.
కొత్త పదాలతో ఓ నోట్స్ తయారు చేసుకోండి.
నేర్చుకున్న పదాలను వీలున్న ప్రతి సందర్భంలోనూ ఉపయోగించండి.
రేడియో, టీవీల్లో వచ్చే ఇంగ్లీష్ ప్రోగ్రాంలను వింటూ...వీలైతే ఆ ప్రోగ్రాంలోని మాటలను రిపీట్ చేస్తూ ఉండాలి.
ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడటానికి జంకకండి.
ఇంగ్లీష్ నేర్చుకోవడానికి న్యూస్ పేపర్లను ఓ మాధ్యమంగా వినియోగించుకోండి.
సెమినార్ ప్రెజెంటేషన్స్ కు ప్రిపేరయ్యే విద్యార్థులకు సూచనలు ఇలా :
ప్రజెంటేషన్ ఇవ్వబోయే టాపిక్ పై స్పష్టత ఏర్పరచుకోవాలి.
ప్రజెంటేషన్ సూటిగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
సమాచారాన్ని ఓ క్రమపద్ధతిలో అమర్చుకోండి.
ప్రజెంటేషన్ నిడివి, సమయం పట్ల స్పష్టత ఏర్పరచుకోండి.
బాగా రిహార్సల్ చేయండి.
ఆడియన్స్ తో ఐ కాంటాక్ట్ ఏర్పరచుకోండి.
మాట స్పష్టంగా వినబడేలా గట్టిగా మాట్లాడండి.
ఆడియన్స్ ప్రశ్నలకు ఓపిగ్గా, పొలైట్ గా సమాధానాలివ్వండి.
ఇంటర్వూ లకు హాజరయ్యే వారికోసం కొన్ని సూచనలు ఇలా :
అప్ డేటెడ్ రెజ్యూమే తో సిద్ధంగా ఉండండి.
ఇంటర్వూకి తగిన విధంగా డ్రెస్ చేసుకోండి.
ఇంటర్వూ ప్రదేశానికి నిర్ణీత సమయానికంటే కనీసం 15 నిమిషాలు ముందే చేరుకోండి.
సమాధానం చెప్పేటప్పుడు కంగారు పడకండి.
మరీ గట్టిగా, మరీ చిన్నగా మాట్లాడకండి.
మీ సమాధానాలు సూటిగా, స్పష్టంగా ఉండాలి.
ఇంటర్వూ ముగిసాక బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు చెప్పండి.
ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులభ సూత్రాలకు సూత్రాలివే. పాటించండి.
1. ప్రతిరోజూ అరగంట :
ప్రతి రోజూ అరగంట ఆంగ్లం కోసం కేటాయించండి. వారంలో ఏదో ఒక రోజు ఏకబిగిన ఐదు గంటలు చదివే దానికంటే.....రోజూ నిర్థిష్ట సమయాల్లో చదవడం మంచిది. అనుకూల సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా చదవండి.
2. రోజుకు ఓ 10 (పది) పదాలు నేర్చుకోండి. (ముందసలు చేసి చూడండి)
భాషకు పదాలే ప్రమాణం. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే....వివిధ రకాల పరికరాలు, వస్తువులు, పనులు....వీటన్నింటినీ ఆంగ్లంలో ఏమంటారో తెలుసుకోవాలి. అందుకే రోజుకు 10 (పది) పదాలు. నేర్చుకుంటే సంవత్సరానికి 3650 పదాలు (365 X 10)
3650 పదాలు మీ మెదడులో నిక్షిప్తమవుతాయి.
పుస్తకం తీసుకుని అందులో పది పదాలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్రాసుకోండి. నేర్చుకున్న పదాలను సంభాషణల్లో తరచూ ఉపయోగించడం మర్చిపోకండి.
అంతే......కొన్నాళ్ళకు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలన్నా ఈ పదాలు సరిపోతాయి.
భాష అంటే అంతే కదా....పదాల (సు) సమాహారం.
3. వినండి...వినండి...ఉల్లాసంగా...ఉత్సాహంగా....!!
వినండి..వినండి...ఉల్లాసంగా...ఉత్సాహంగా....అన్నంత రీతిలో ఉండాలి.
అమ్మ ప్రేమంత కమ్మదనంగా ఉండాలి.
భాషపై మమకారాన్ని పెంచుకోవాలి.
తెలుగు భాష మాట్లాడే ప్రతి జీవి ఇతర ప్రపంచ భాషలను నేర్చుకోవడం చాలా ఈజీ (సుళువు) అని భగవంతుడు ఏనాడో నిర్ణయించేశాడు. కానీ మనమే నిర్లిప్తతతో ఏమీ చేయకుండా ఉంటున్నాం. మనకింత గ్రాహక శక్తి ఉన్నా సరైన విధంగా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం.
ఇక పై అలా వద్దు.
సర్వ భాషాను రక్తియే ముద్దు.
లిజన్ – హియర్ మధ్య తేడా ఏమిటో తెలుసా ?
లిజన్ అనేది యాక్టివ్.
హియర్ అనేది పాసివ్.
కొన్నిసార్లు మనం ఇబ్బందిగా వింటాం.
మరి కొన్ని సార్లు వినడానికి ప్రయత్నిస్తాం.
కనీసం ఆలకించడానికి ప్రయత్నించండి.
మీరు వినే ప్రయత్నంలో కొన్ని పదాలను మాత్రమే నేర్చుకోగలరు.
తర్వాత చెబుతున్న దాన్ని సరిగా క్యాచ్ చేయలేరు.
అందుకే డోంట్ లిజన్....బి హియర్.
మీరింకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. కాబట్టి ఆలకిస్తే చాలు...!!
బ్రెయిన్ హియర్ గానూ, సబ్ కాన్షియస్ మైండ్ లిజన్ గానూ పనిచేస్తాయి
ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు.
4. బాగా విన్న వాళ్ళే...మాట్లాడటాన్ని నేర్చుకోగలరు
గమనించండి. బాగా విన్న వాళ్ళే....మాట్లాడటాన్ని నేర్చుకోగలరు. వారికి చాలా సుళువుగా వచ్చేస్తుంది. ఆ తర్వాత చదవగడగడం....చివరిగా వ్రాయగలిగే సామర్ధ్యం వస్తాయి.
మొదటి అడుగు మాత్రం వినడంతోనే.....!!
సో లిజన్ కేర్ ఫుల్లీ.....
వినండీ...వినండీ....ఉల్లాసంగా...ఉత్సాహంగా....!!
5. వర్డ్ స్ట్రెస్ – (ఉచ్చారణ) కోసం కష్టపడండి.
ఏమిటీ....??
అదేనండీ...
ఇష్టపడి కష్టపడమంటున్నాం
ఎందుకలాగా...??
ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నా.....ఇంగ్లీష్ ను అర్థం చేసుకోవాలన్నా....వర్డ్ స్ట్రెస్ (ఉచ్చారణ) గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే....
నాలుకను అదుపులో ఉంచినవాడు ప్రపంచాన్నంతా జయిస్తాడనేది సామెత. హృదయంతో, ఆలోచించి మెదడుతో పని పనిచేయించే వ్యక్తి గొప్ప స్థాయికి చేరుతాడు.
మంచి ఉచ్ఛారణ కోసం అందుబాటులో ఉన్న వీలైనన్ని సోర్సెస్ లు రూపొందించుకోండి.
గ్రంథాలయాలు, తోటి మిత్రులతో డిస్కషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, డిబేటింగ్స్, రేడియో వార్తలు వినడం, వార్తా పత్రికలు చదవడం.....కరెంట్ ఎపయిర్స్ వంటివి, బర్నింగ్ టాపిక్స్ తో ఓల్డ్ అంశాలను మిక్సప్ చేసుకుంటూ....మదిలో, హృదిలో నిక్షిప్తం చేసుకుంటూ ఇష్టపడి, కష్టపడి చదవండి.
నిస్సందేహంగా మీరే నెంబర్ వన్ కాగలరు ?
6. ఫైనల్ గా పునశ్చరణ :
ఇక చివరగా పునశ్చరణ అనేది తిరుగు లేని తారక మంత్రం వంటిది. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడంలో వంద శాతం విజయం సాధించడానికి పునశ్చరణ కీలకమైనది. నేర్చుకున్నదాన్ని ఒక రోజు / వారం / నెల తర్వాత మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకొని పరీక్షించుకుంటే....మరిచిపోవడమంటూ ఉండదు.
నిన్న నేర్చుకున్నదాన్ని ఈ రోజు....
ఈ వారం చదివిన దాన్ని వచ్చే వారం....
నెల మొత్తంలో నేర్చుకున్న దాన్ని వచ్చే నెల......
ఇలా మూడు సార్లు స్ఫురణకు తెచ్చుకుంటే మనో ఫలకంపై ఆ సమాచారం జీవితాంతం నిక్షిప్తమైనట్లే.....!!
Well begun is half done.
ఇక్కడ ప్రయత్నించండి అనే మాట ఉండనే ఉండకూడదు.
చూడటమే
ఫలితం చూడటమే.
ఇక మీరు మీరే.
మీకు మీరే.
మీరే మీకు రోల్ మోడల్
మోడల్ గా మీకు మీరే.
విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గో ఎ హెడ్.
0 Responses to ఇంగ్లీష్ ఏమంత కష్టం కాదు