నిత్య జీవన గమనంలో విద్యార్థిగా, ఉద్యోగార్థిగా, ఉద్యోగిగా వివిధ సమయాలలో , సందర్భాలలో ఆంగ్లంలో మాట్లాడాల్సిన అవసరం ఉత్పన్నమవుతుంది. అప్పటికి చక్కగా మాట్లాడగలగడం ప్రధానం కాని ఆంగ్ల భాషనంతా ఇతడు ఔపోసన పట్టాడని ఎదుటివారు చూడరు.
అలాంటి సందర్బాలలో ఉపయోగించేందుకు రెడీమేడ్ వాక్యాలు, సంభాషణలు అక్కరకు వస్తాయి. ఎదుటి వారికి ‘ఇతడికి ఇంగ్లీష్ లో ప్రవేశం ఉంది సుమా’ అన్పిస్తాయి.
అలాంటి కొన్ని సందర్భాలను ఎంపిక చేసి సంభాషణలు పోస్ట్ చేయడం జరుగుతుంది. వీటిని సందర్భానుసారంగా యధాతథంగా వినియోగించుకోవచ్చు.
1. పలకరింపు మాట :
భాషలో సమర్థవంతంగా భావ వ్యక్తీకరణ చేయడానికి మనకు వివిధ రకాల వాక్యాలతో పాటు ఎన్నో పదాలు అవసరమవుతాయి. అయితే మన అవసరాన్ని బట్టి, అక్కడున్న సందర్భాన్ని బట్టి మనకు తెలిసిన పదాలను ఉపయోగించడంలో మన తెలివిని ఉపయోగించాలి. మనకు నిత్య జీవితంలో సామాన్య పరిస్థితులలో తారసపడే వ్యక్తులతో సంభాషించడం ఓ విధంగా ఉంటే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో – అంటే ఏదైనా ఆఫీస్ కు వెళ్లి కోర్సుల వివరాలు, ఫీజు వివరాలు అడగటం, బ్యాంకు లేదా రైల్వే స్టేషన్ లలో ఎంక్వైరీలు మొదలైన వాటిలో సంభాషించడం మరో విధంగా ఉంటుంది.
నిత్య జీవితంలో సాధారణ పరిస్థితులలో మనం
1) How are you ?
2) How do you do ?
3) Good Morning !
లాంటి ఎన్నో వాక్యాలను సామాన్యంగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వీటిని ఏయే సందర్బాలలో ఉపయోగించాలో గుర్తుంచుకుంటే మంచిది.
ఉదాహరణకు Good Morning ! లాంటి పలకరింపు మాటలను ఉపయోగించడంలో చాలా మంది తప్పు చేస్తుంటారు.
మనలో ఎక్కువ మంది ఒక వ్యక్తిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలలో ఏ సమయంలోనైనా మొదటిసారిగా కలిసినప్పుడు పలకరింపుగా Good Monring అంటూ ‘విష్ ’ చేస్తారు. కాని దీన్ని ఉదయం వేళలలో విష్ చేసినపుడు మాత్రమే ఉపయోగించడం అనేది సరైన పద్ధతి.
అదే విధంగా మధ్యాహ్నం వేళలలో మొదటిసారిగా కలిసినపుడు Good Afternoon అని, సాయంత్రం, రాత్రి వేళల్లో మొదటిసారిగా కలిస్తే Good Evening అంటూ విష్ చేయాలి.
అదే విధంగా ‘ క్షేమంగా ఉన్నారా ? ’ అని అడగటానికి ఆంగ్లంలో How are you ? అని అంటాము.
బాగున్నారా ! అని అడగటానికి, ఆంగ్లంలో విష్ చేయడానికి
How are things getting along ? అని కాని,
How is life ? అని గాని అనవచ్చు.
ఉదయం పూట కలుసుకున్న ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణను గమనించండి :
వెంకట్ : Good morning, Mahesh !
మహేష్ : Good morning Venkat !
వెంకట్ : How are you ?
మహేష్ : Fine, thanks, And you ?
వెంకట్ : Fine
మహేష్ : How is life ?
వెంకట్ : OK. How’s yours ?
మహేష్ : Not bad.
అయితే ఇవి ఇద్దరి స్నేహితుల మధ్య మాటలు కాబట్టి సంభాషణలో పేర్లను ఉపయోగించారు. కాని పెద్దవారితో సంభాషిస్తున్నప్పుడు మాత్రం –
Good Morning Sir / Madam, అని కాని,
How are you, Sir / Madam అని కాని గౌరవ సూచకంగా వాడాల్సి ఉంటుంది.
అదే విధంగా పలకరింపు మాటల్లో ఉపయోగించే ఇతర వాక్యాల విషయానికి వస్తే ఇన్ని రోజులు కన్పించలేదు, ఎక్కడికి వెళ్ళారు ? అనడానికి
I haven’t seen you for several days అని కాని,
Where have been all these days ? అని కాని అంటాం. దానికి అవతల వ్యక్తి చెప్పే సమాధానం నేను ఊరెళ్ళాను అని అంటే
I was out of station అని కాని,
I was not in town అని కాని, నేనీ మధ్య కాస్త బిజీగా ఉన్నాను అనటానికి –
I have been busy all these days అని కాని, నేను హైదరాబాద్ వెళ్ళాను అనటానికి
I went to Hyderabad అని కాని, అతిథులను చూచి వచ్చాను అనటానికి
We visited guests అనే వాక్యాలలో ఏదో ఒకటి సమాధానంగా చెప్పవచ్చు.
ఇలాంటివన్నీ మనకు పరిచయం ఉన్న వ్యక్తులతో, స్నేహితులతో మాట్లాడినప్పుడు ఉపయోగించాల్సిన వాక్యాలు.
మనం అపరిచితులతో మాట్లాడుతున్నప్పుడు, కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, పరిచయం చేసుకుంటున్నపుడు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాట్లాడాల్సి వచ్చినపుడూ భాషను కాస్త మార్చి మాట్లాడాలి.
ఎవరైనా కొత్త వ్యక్తులను మనం పరిచయం చేసుకోవాలనుకున్నపుడు సాధారణంగా ‘విష్ ’ చేసి మన పేరు చెప్పుకుంటాము. దీనిని
Hello, I am Venkat అని లేదా
My Name is Venkat అని గానీ,
I am from Vijayawada అనో ఊరు పేరు కూడా చెప్పుకుంటాం.
అదే విధంగా ‘మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ’ అని చెప్పడానికి ఆంగ్లంలో –
Glad to meet you,
Happy to meet you,
Nice to meet you
అనే వాటిల్లో ఒకదానితో కానీ, లేదా gerund form తో ఉపయోగించి
Nice meeting you,
Pleasure meeting you లలో ఒక దానిని ఉపయోగించవచ్చు.
ఒక వేళ మీ ఫ్రెండ్ ఎవరైనా తన ఫ్రెండ్ ను మీకు పరిచయం చేస్తున్న సందర్భాలలో కూడా పై వాక్యాలలో ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. ఇలాంటి ఓ మాదిరి సంభాషణను చూడండి.
వెంకట్, ప్రసాదు ఇద్దరు మిత్రులు. వెంకట్ తన ఇంకొక మిత్రుడు రాము ను ప్రసాదుకు పరిచయం చేస్తున్న సందర్భంలో.....
వెంకట్ : Hello Prasad
ప్రసాదు : Hi, Venkat !
వెంకట్ : How are you ! ?
ప్రసాదు : Fine, thanks.
వెంకట్ (రామును చూపిస్తూ) : Prasad, meet my friend, Ramu
ప్రసాదు : How do you do ? Glad to meet you.
రాము : How do you do ? Nice to meet you.
తర్వాత సంభాషణ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత సందర్భాలలో అందరూ టీ తాగడానికి వెళ్దామనుకుంటే –
Let us have tea అని కాని,
Let’s have coffee / cool drinks అని కాని ఉపయోగించుకోవచ్చు.
లేదా Library కి వెళ్తామనుకుంటే....
Let us go to (the) library అని చెప్పాలి.
ఇంతకు ముందు చెప్పుకున్నట్లు Good Morning లాంటివి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలనే దానిపైన కూడా స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు చక్కని ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం కలుగుతుంది. మనం ఎవరినైనా మధ్యాహ్నం 12 గంటలకు ముందు గనుక మొదటిసారిగా కలిసినట్లైతే Good morning అని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కలిసినట్లైతే Good Afternoon అని, సాయంత్రం – రాత్రి వేళల్లో కలిసినట్లయితే
Good Evening అని విష్ చేయాలి. అదే విధంగా సంభాషణ పూర్తయి మధ్యాహ్నం విడిపోతున్నప్పుడు
Have a good day ! అని గాని
Good day ! అని కాని చెప్పాలి. ఒకవేళ రాత్రివేళల్లో విడిపోతున్నపుడు, మళ్లీ ఇక ఆ వ్యక్తిని కలిసే అవకాశం లేనప్పుడు
Good Night అని చెప్పాలి. ఇక అది ఆ రోజుకు చివరి కలయిక అన్నమాట.
REST IN NEXT…..!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to మీరూ మంచి కమ్యూనికేటర్ అవ్వాలనుకుంటున్నారా ?