------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH

సంభాషణ ప్రారంభించటానికి

Posted by Sumani's English Thursday, December 31, 2009

మనం భాష మాట్లాడుతున్నప్పుడు వివిధ సందర్భాలకు అనుగుణంగా వ్యక్తులను బట్టి అనేక పలకరింపు మాటలు మాట్లాడుతుంటాం.  ఇలాంటి పలకరింపు మాటలు, విష్ చేయడానికి వాడే పదాలు, వాక్యాలు కొన్నింటిని ముందు పోస్ట్ లో చదివి తెలుసుకున్నారు కదా.
ఇలాంటివే మరికొన్ని పలకరింపు మాటలు, శుభాకాంక్షలు తెలిపే, వివిధ సందర్భాలకనుగుణంగా వ్యక్తులను బట్టి ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

స్పోకెన్ ఇంగ్లీష్ లో కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది చాలా ముఖ్యం.  అయితే ఈ కమ్యూనికేషన్ సక్రమంగా ఉండేందుకు మనం మాట్లాడే భాషలో, సంభాషణల్లో అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ అనుసరించే కొన్ని పదాలను, వాక్యాలను, సందేశాలను ఉపయోగించడం తప్పనిసరి అవుతుంది. 
అప్పుడే మన భావ వ్యక్తీకరణ సమర్థవంతంగా ఉంటుంది. 
ఏ భాషలోనైనా, సమాజంలోనైనా పలకరింపు మాటలు, శుభాకాంక్షలు తెలపటం అనేవి పరిపాటి.
వివిధ సందర్భాలలో వాడే పలకరింపు మాటలు మన మర్యాదను, వ్యక్తిత్వాన్ని, నడవడిని అవతలి వ్యక్తి పట్ల మనకు గల గౌరవాన్ని చాటుతాయి.  మనం నిత్య జీవితంలో ఎన్నో సందర్భాలలో – ఉదాహరణకు, టెలిఫోన్ ఎత్తగానే Hello అంటూ, ఎవరైనా పెద్దవారు కానీ, మన గురువులు కానీ దారిలో కనిపించినా మన ఇంటికి వచ్చిన, ఇతర అతిథులతో గానీ Namaste, Namaskar, Good Morning అంటూ, పలకరిస్తూ ఉంటాం.
మనం నివాసం ఉంటున్న స్థలాన్ని గురించి అంటే మన అడ్రస్ ను ఇతరులకు ఎలా చెప్పాలి ?
ఇతరుల సహాయాన్ని ఎలా పొందాలి ?
మనం ఇతరులకు సహాయాన్ని ఎలా చేస్తామని చెప్పాలి ?
ఇలాంటి విషయాలను ఇపుడు చదివి తెలుసుకుందాం.
మనం కొత్త వారితో పరిచయం చేసుకొనే సందర్భాలలో కొన్ని సార్లు మన అడ్రస్ లను ఇచ్చే అవసరం ఏర్పడవచ్చు.  ఇలాంటి సందర్భాలలో మనం మామూలుగా విష్ చేసి,
1)    I am Sumathi
2)    Now I am living / staying at Patamata అంటు ఉంటున్న ప్రాంతం పేరు చెప్పి, ఆ తర్వాత నగరం పేరు చెప్పాలి.  ఇంటి నంబర్ కనుక ఉన్నట్లయితే అది చెప్పటంతో పాటు మనం ఉంటున్నా ఇంటి పక్కన ఏవైన తెలిసిన బిల్డింగ్ లు, ప్రదేశాలు ఉంటే అవి కూడా చెప్పాలి. 
క్రింద వివరించిన ఉదాహరణలో సుమతి తన పేరు ఇంటి అడ్రస్ ఎలా చెబుతున్నదో గమనించండి :
I am Sumathi.  I am from Vijayawada.  I am living at 10-20. Patamata, Vijayawada.  It’s opposite to Sri Ramalayam Temple

అంటూ సంభాషణ ప్రారంభించటం కాని, లేదా మన అడ్రస్ ను వివరించడం కాని చేయవచ్చు.  బాగోగుల గురించి అడగటానికి –
How are your parents ? అనో
How is your sister ? అనో అడగవచ్చు. 
ఇంకా మనం –
Did you attenhd the meeting yesterday ? అనీ,
Why were you absent ? అనో అవసరమైన ప్రశ్నలను వేయవచ్చు.
ఇంకా మనం మన ఆఫర్ లను రిక్వెస్ట్ లను can, could, would, would like వంటి పదాలతో్ రూపొందించుకోవచ్చు.
మనం ఇతరులకెవరికైనా సహాయం చేయదలచినపుడు
Can I help you ? అని కాని,
Could I help you అని కాని, ప్రారంభించవచ్చు.
ఏదైనా వస్తువు కానీ, డబ్బు కానీ అప్పుగా అడుగుతున్న సందర్భంలో కూడా
Could I borrow ?  అంటూ మనకు కావల్సింది అడగవచ్చు.  దీంట్లో Can I అనేది తెలిసిన వారితోనూ, తోటి వయసువారితోను ఉపయోగిస్తే, Could I ను ఎక్కువ మర్యాదను సూచించడానికి ఉపయోగిస్తాం.  మనం ట్రైన్ లో గానీ, బస్సులో గానీ వెళ్తున్నప్పుడు తోటి ప్రయాణీకుడు ఎవరైనా పొగత్రాగటం మొదలు పెడితే అతడిని మాన్పించడానికి
Would you mind stop smoking ? అని అడుగవచ్చు. 
ఇలాంటి request నే Will you తో పాటు ఉపయోగించవచ్చు.
ఎవరినైనా నిశ్శబ్ధంగా ఉండమని చెప్పడానికి
Will you be quiet for a moment, please ? అని చెప్పవచ్చు.  మన ఇంటికెవరైనా అతిథులు వస్తే మొదటగా మనం మంచినీళ్ళు ఇచ్చే ముందు
Would you like to have some water ? అనో,
లేదా ఏదైనా కూల్ డ్రింక్ ఇచ్చే ఉద్దేశ్యం గనుక ఉన్నట్లయితే
Would you like to have some drink ? అనో అడుగవచ్చు.  అంతేకాక ఇంట్లో మన కుటుంబ సభ్యులతో మామూలుగా చెప్పే పనులకు కాని, రిక్వెస్ట్ చేయడానికి గాని, ఇలాంటి వాక్యాలనే ఉపయోగించవచ్చు. 
కిటికీ కాని, తలుపు కానీ తెరవమని చెప్పటానికి –
Will you open the window or door ? అని అడుగవచ్చు.  అదే విధంగా మనకు ఇష్టం ఉన్న వస్తువుల గురించి కానీ, పనుల గురించి కానీ వాక్యాలను రూపొందించుకోవచ్చు.
నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పడానికి –
I would like to have another ice-cream అని,
మేం ఇక వెళ్తాం అని చెప్పడానికి
We would like to go / move now అని,
ఇంకో బ్రెడ్ ముక్క ఎవరికి కావాలి ? అనటానికి –
Who wants another piece of bread ? లాంటి ప్రశ్నలు అడగవచ్చు.
REST IN NEXT…..!!

0 Responses to సంభాషణ ప్రారంభించటానికి

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments