మిత్రులందరికీ నమస్కారం.
ఏదైనా విజయానికి కారణభూతమయ్యేవి చాలా కారణాలు ఉంటాయి. కష్టేఫలి. శ్రమయేవ జయతే. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు....మహా పురుషులౌతారు అనేవి విశ్వజనీన సార్వత్రిక మూల సూత్రాలు.
గౌరవనీయులైన సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
మీ అందరి సహాయ సహకారాల వలన విత్తుగా ఉండి మొలకెత్తుతున్న ఈ పరిణామ దశలో మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే....
చాలా మంది సభ్యులు తమ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ ఇస్తూ...మంచిగా తీర్చిదిద్దటానికి దోహదపడుతున్నారు. అయితే మెజారిటీ దృష్ట్యా....ఇంకా చాలా మంది స్తభ్దుగా ఉండిపోతున్నారు. ఈ నిశ్శబ్ధాన్ని ఛేదిద్దాం....మనందరం ఐకమత్యంగా సాంకేతిక ప్రగతి వైపు ప్రయాణం చేద్దాం. మన సుదూర తీరాల గమ్యాన్ని చేరుకునేందుకు ప్రయాణిద్దాం. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగు తోనే ప్రారంభం కాబట్టి.... అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకొని అనుమానంతో సంశయిస్తూ ఉండే కంటే...ముందుగా ఒకడుగు వేద్దాం...అదే గమ్యాన్ని చేరుస్తుంది.
ఇందులో నిరంతరం సమాచార విస్తరణ, సేకరణ, క్రోడీకరణ అనే ప్రక్రియలు అందరి కోసం జరుగుతూంటూంది. ఇది కేవలం ఏ ఒక్కరికోసమో కాదు. ఇది మనందరిది. ఖచ్చితంగా చెప్పాలంటే...మీది.
ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పాటుపడుతున్న వేదిక ఇది.
నిఝం చెప్పవలెనంటే... ఉదాహరణకు ఒక వ్యక్తి 2000 సంవత్సరంలో పుట్టాడనుకుందాం. షుమారుగా ఆయుర్ధాయం 100 సంవత్సరాలు అనుకుందాం. అయితే ఒక్క లాజిక్ ఆలోచించండి. అతను 1999 సంవత్సరం...ఆ సంవత్సరంలో జరిగిన వింతలు, విశేషాలు చూడలేడు. అలాగే 2100 వ సంవత్సరం తరువాత జరగబోయే సంఘటనలను చూడలేడు. వినలేడు. ఎందుకని....2000 వ సంవత్సరం ముందు అతను పుట్టలేదు కనుక. 2100 సంవత్సరం తరువాత తను బ్రతికి ఉండడు గనుక.
అయితే ఒక్కటి చెప్పండి మాకు....? ఏమిటంటే...అతను 2000 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం వరకు బ్రతికే 100 సంవత్సరాలలో అతను ఏం చేయగలడు. ఒక 25 సంవత్సరాలు విద్యాభ్యాసం...తదుపరి గృహస్థాశ్రమ ధర్మంగా వివాహం....తరువాత కేర్ కేర్ మంటూ పిల్లలు, తదుపరి ఉద్యోగ నిర్వహణ...సంపాదన...ప్రమోషన్...ఆర్జనాపరమైన ఆలోచనలు...కుటుంబ నిర్వహణ ఇతరత్రా ఇలా...తదుపరి నడి వయసు దాటిన తరువాత ఏమిటి...వచ్చేది వార్థక్యమే కదా...వార్ధక్యంలో ఎదురయ్యే ఇబ్బందులు...సమస్యలు..సమస్యల వలయాలు నుంచి తప్పుకునే క్రమంలో సమస్యలతో పోరాటం చేస్తూ....కాలం గడపటం...(సాధారణంగా మానవ జీవితపరిణామ క్రమంలో ఎదురయ్యే విధానాన్ని క్లుప్త రూపంలో తెలియజేయటం జరిగిందని గౌరవ సభ్యులు గ్రహించాలని కోరుకుంటున్నాం) చివరికి మిగిలేది మహా ప్రస్థానం.
ఈ అనంత కాల పరిణామ చక్రంలో ఏదో పుట్టాం...ఎదిగాం...గిట్టాం...అనే సిద్ధాంతం తప్పేనా...ఒప్పేనా అని అంత: పరిశీలన చేసేముందు కొంచెం...వివరాలలోకి వెళ్దాం.
మనం సంఘం కోసం ఏం చేశాం. మనమేదో సంఘ సంస్కర్తలం కాదు. మన జీవితాన్నే ఉద్ధరించుకునే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు , ఆపసోపాలు పడుతున్నాం. కనుక అందరూ ఒకే విధమైన జీవితాన్ని గడుపుతున్నారు అని అనుకోకండి. కానీ మనదంటూ ఒక ముద్ర, ఒక లైఫ్ స్టైల్, ఒక చెరగని జీవిత ముద్ర ఉండాలి కదా. కీర్తి ప్రతిష్టలు ఊరకనే రావు కదా. శ్రమించి సాగితేనే కదా. ఇంకొక్క విషయం....ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అనేది చాలా అరుదైన లక్షణం. ఈ లక్షణం అందరికీ అలవడాలనేది మా సమిష్టిగత అభిప్రాయం.
మన వయస్సు పెరిగిన కొద్దీ మానవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా...ఆహా నేను ఎదుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ రోజు గడిచేకొద్దీ...తరుగుతున్నది ఆయుష్షు అని గ్రహించలేకపోతున్నాడు. అయితే....
తరిగే వయస్సుతో పెరిగేది విజ్ఞానం
రోజు రోజుకూ పెరిగే విజ్ఞానాన్ని అందరితో పంచుకుని అందరికీ కాకపోయినా కొందరికైనా మార్గదర్శకత్వం వహించి దారి చూపించటం...కూడా మంచి వ్యక్తుల లక్షణం.
కొందరిలో విజ్ఞాన సేకరణ, లేదా వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటివారు సమాజ హితాన్ని కోరి చాలా విధాలుగా వ్యక్తం చేస్తుంటారు. తోటి వారికి సహాయపడుతూ ఉంటారు. అయితే అందరూ ఒక్కలా ఉండలేరు కాబట్టి. వారి వారి పరిధిలో తోచిన సాంకేతిక విజ్ఞానాన్ని, సాంకేతిక వీచికలను యధేచ్చగా వీచనివ్వండి.
స్వార్థంతో నిండిపోయిన నేటి ప్రపంచంలో కొంత మంది యువకులు ముందు తరం దూతలు. జీవన నవజీవన బృందావన నిర్ణేతలు. సాంకేతిక ప్రగతి రహదారులు నిర్మించే నిరంతర శ్రామికులు. సాంకేతిక ప్రగతి పథం వైపు పయనించటానిక వీలైన సౌకర్యాలు సమకూర్చే సారధులు...మిత్రులు ఉన్నారు. వారు సంఘానికి ఏదో కొంత సేవ చేయాలని పూనుకున్నప్పుడు మన వంతుగా మనం ఏం చేయాలి...? మనమేం జేయాలి....????
మీకంటూ ఒక అనుబంధ బాంధవ్యాలు ఎలా ఏర్పడతాయి. పుట్టుక రీత్యా అమ్మ, నాన్న, అక్క , అన్న, చెల్లి, తమ్ముడు, బంధుగణం.....జనం.
అయితే మిత్రులు.....?????
ప్రపంచం మొత్తం నిన్ను వీడిపోతున్న దశలోగానీ, నిన్నువీడిపోయిన దశలో గానీ నీకంటూ అండగా నిలబడినవాడే నిజమైన మిత్రుడు. మహా నిర్వాణం అనంతరం మనకు లభించేది మన కీర్తి కాంతలు ఏమిటో తెలుసా....మనం చేసిన మంచి పనులు.
అయితే విజ్ఞాన వీచికలను ప్రసరింపజేయటం అంత తేలికైన పని కాదు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. లేదా ప్రయత్నిస్తున్నప్పుడు సమస్యలు ఎదురవ్వవచ్చు.
దయచేసి ఈ యజ్ఞంలో భాగస్వాములు కండి.
మీ అందరికీ స్వాగతం....సుస్వాగతం.
చాలా బాగా చెప్పారు. నలుగురికీ మన విజ్ఞానం పంచితేనే మనకి విలువ.
you are doing a great job. Keep it up and keep giving us valuable information. Life is a constant journey. Learning new things is part of that.