------------------------------------------------------------Stat Star Star 99999
Content feed Comments Feed
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | Other
Sumani Venkat Vignanam కు స్వాగతం..సుస్వాగతం..... Welcome to our Blog.. This is universality purpose మీ కోసం.... only. ఈ బ్లాగ్ లో లభ్యమయ్యే సాంకేతిక విషయలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ....రెండూ భాషల్లోనూ అనగా in Telugu & English భాషల్లో ప్రాధాన్యతనిస్తూ విషయాలను తెలియజేయటం జరుగుతుంది..ఈ విషయాలను అందరికీ బహుళ ప్రయోజనం కోసం తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అందరూ వినియోగించుకోండి.జీవితం కరిగిపోయే మంచు..ఉన్నంతలో..తెలిసినంతలో మంచిని, విజ్నానాన్ని అందరికీ పంచు.

Heading of Testing

Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test - Test

Sumani's English

SUMANI'S ENGLISH

ఫోన్ లో ఇంగ్లీష్

Posted by Sumani's English Thursday, December 31, 2009

ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతిరోజు టెలిఫోన్ లో మాట్లాడటం మనకు సర్వసాధారణమై పోయింది.  చాలా మందికి టెలిఫోన్ లో ఎలా ఆంగ్లంలో మాట్లాడాలో తెలియదు.  ఈ భాగంలో టెలిఫోన్స్ మానర్స్ గురించి తెలుసుకుందాం.
మీరు ఎంత బిజీగా ఉన్నా, చికాకుగా ఉన్నా, రిసీవర్ ను తీసుకొని తాపీగా “Hello!” అంటూ కంఠంలో శ్రద్ధను కనపరచాలి.  ఎందుకంటే ఎదుటి వారు ఎవరో, ఎంత ముఖ్యమైన వారో మనకు తెలియదు కదా ! 
అందుకనే సాధ్యమైనంత వరకు విసుగును చూపకుండా హాపీగా......!!

Hello ! అనటం నేర్చుకోవాల్సిందే.

ఎదుటి వక్యక్తి రిసీవ్ చేసుకోగానే –
ఎవరు మాట్లాడేది ?
వెంకట్ తో మాట్లాడవచ్చా ?
అసలు ఇది వెంకట్ ఇల్లేనా ?
అంటూ ఆంగ్లంలో
Who is speaking ?

Who is talking ?

Can I speak to Venkat ?

Is it Venkat’s House ?

అని ప్రశ్నల వర్షాన్ని కురిపించవద్దు.

మొదట Hello ! అనీ,
Is it 123456789 ? అనీ, మనకు కావాల్సిన నెంబర్ కు చేరామా లేదా తెలుసుకోవాలి.
Yes అని ఎదుటి వ్యక్తి స్పందించినపుడు –
Could I speak to Mr. Venkat ? అని కానీ
Could I speak to Mr. Venkat, please ? అంటూ మర్యాదతో అడిగితే ఎదుటి వ్యక్తి విసుక్కోరు.
Can కంటే Could తో అడిగితే ఎక్కువ మర్యాదను సూచిస్తుంది.
ఉదయం 6 గంటల ముందు, రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేస్తే మొదట
Sorry to disturb you – మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణ కోరుకుంటున్నానని అంటే,
ఎదుటి వ్యక్తి అనవసరంగా నిద్ర పాడు చేశారని అనుకోరు.
Good Morning !

A very good morning – అంటూ సంభాషణ మొదలు పెడితే అతను హాపీగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

Venkat is asleep – వెంకట్ నిద్రపోతున్నారు

Could you call back later, say, after an hour ?

ఓ గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారా ?
అని మర్యాదగా అడిగినపుడు మనం ఎదుటి వారి నిద్ర ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని

OK.  No Problem.

Thank you – అంటూ సమాధానం ఇవ్వాలే కానీ,

అర్జంట్ కానప్పుడు

Please wake him up and ask him to talk to me right now

దయచేసి నిద్రలేపి ఉన్నపళంగా ఇప్పుడే మాట్లాడమనండి అంటూ ఇతరులను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు.

కొందరు వాళ్ళకు ఫోన్ లేకున్నా దగ్గరలో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్ ను వాళ్ళదేనన్నట్లుగా ఇతరులకు ఇస్తుంటారు.  అప్పుడు తప్పక PP 123456789 అనీ, PP లను ముందు చేర్చి నెంబరును ఇవ్వాలి (PP అంటే Particular person – ఫలానా వ్యక్తి).
లేకపోతే రిసీవర్ ను అందుకోగానే ప్రశ్నల వర్షాన్ని ఎదుటి వారిపై కురిపిస్తే అసలు ఫోన్ వున్న వారికి ఓపిక ఉండకపోవచ్చు. 
ఒకరి నెంబర్ ను మీరు PP తో స్పేచ్ఛగా వాడుకుంటున్నప్పుడు వాళ్ళకు ముఖ్యమైన కాల్స్ గురించి ముందే చెప్పి వుంచాలి.  అప్పుడు వాళ్ళు మిమ్ములను విసుక్కోకుండా –
Please, hold on for a moment – దయచేసి కొద్దిసేపు అలానే ఉండండి – అంటూ
మిమ్ములను పిలుస్తారు.
విసుక్కుంటే –
Hold on,

Hang on అని ముక్తసరిగా అనే ప్రమాదం ఉంది.  లేదా కోపంగా –
Sorry, it is not possible అని ఫోన్ పెట్టివేయవచ్చు.
అవతల వ్యక్తి మర్యాదగా మాట్లాడకపోయినా మిమ్ములను పిలవరు.  మీరు PP నెంబర్ ను మీ మిత్రులకు ఇచ్చినపుడు ఆ ఫోన్ ఎంత దూరంలో వుంటుంది, ఫోన్ వున్న వాళ్ళను గురించి కొంత చెప్పి పెట్టి ఉంచాలి.
Sorry to give you trouble – మీకు ఇబ్బంది కలుగజేస్తున్నందుకు క్షమించాలి – అంటూ సంభాషణ మొదలు పెడితే బావుంటుంది. 
క్లుప్త సమాచారానికి కూడా పిలిపించుకోకుండా
Could you kindly pass on a message to Mr. Venkat ?

దయచేసి ఈ సమాచారాన్ని వెంకట్ గారికి చేరవేస్తారా ? అని message ని ఇవ్వడం మంచిది.
What is the message ? – విషయం ఏమిటి అన్నప్పుడు
Please ask him to meet Mahesh at 8 a.m. on Sunday – దయచేసి మహేష్ ను ఆదివారం ఉదయం 8 గంటలకు కలవమని చెప్పండి.
వ్యక్తిగతంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు
Could you please call Mr. Venkat ?

దయచేసి వెంకట్ గారిని పిలిపిస్తారా ? అనీ

I shall call back after five minutes – ఐదు నిముషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాననీ ఫోన్ పెట్టేస్తే మీకు బిల్లు తక్కువవుతుంది.  వాళ్ళకి వేరే కాల్ మధ్యలో రిసీవ్ చేసుకొనే అవకాశం ఉంటుంది.  పిలవటానికి, రావటానికి టైం పడుతుంది కాబట్టి ఫోన్ పెట్టి వెయ్యడమే మంచిది.

ప్రతి చిన్న విషయానికి పిలిపించి మాట్లాడించటం ఎవరికీ వీలు కాదు.  దానికి తోడు ఫోన్ Living Hall లో కానీ, Bed Room లో కాని ఉంటుంది.  కాబట్టి బయటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మాట్లాడటానికి సౌకర్యంగా ఉండదు.

ఫోన్ లో చాలా మంది అనవసరపు విషయాలను ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉంటారు.  కలిసి మాట్లాడుకునే విషయాలను కూడా ఫోన్ లో మాట్లాడేసి, కలిసినప్పుడు ఎక్కువ మాట్లాడరు.  Trunk Calls లేదా STD Calls చేస్తున్నప్పుడు ప్రతి సెకండు ముఖ్యం కాబట్టి.

Hello Namaste / Good evening Sir !

I am Venkat

I am coming to Hyderabad on Sunday

Will it be convenient for you to wait for me between 10 and 11 a.m. ?

Could I meet you on Sunday at 10-30 a.m. ?

Do you want me to come to your place on Sunday at 10-30 a.m. ? 

“Yes” అంటే thanks అనీ,
The rest in person.  Bye !

మిగతా విషయాలు సమక్షంలో అంటూ పన్నెండు సెకండ్లలో ముగించాలే కానీ, కలిసాక మాట్లాడే విషయాల్ని ఫోన్ లోనే వాదం చేస్తే....
బిల్లు మిమ్ములను వాయించేస్తుంది. 

Will it be convenient for you to wait for me between 10 and 11 a.m. ?

Could I meet you on Sunday at 10-30 a.m. ?

Do you want me to come to your place on Sunday at 10-30 a.m. ?

ఈ పై వాక్యాలలో మర్యాద పూర్వకంగా ఎదుటి వారి అనుమతిని కోరుకున్నాము కనుక...వారిని
I am coming on Sunday at 10-30 a.m.
You wait for me అని ఎదుటి వారి వీలు చూడకుండా అనవద్దు.
Trunk Calls చేసేటప్పుడు డ్రాప్ట్ ను తయారు చేసుకొని మాట్లాడితే బావుంటుంది.  డ్రాప్ట్ లేకుండా మాట్లాడితే కొద్దిసేపు ఆలోచించి మాట్లాడాలి.  లేకపోతే పనికి రాని విషయాలను పదే పదే చెపుతూ, అసలు విషయాలను సరిగా చెప్పలేకపోవచ్చు.
Public Booth (Call Box in American English) నుండి ఫోన్ చేస్తే క్లుప్తంగా మాట్లాడాలి.  దాని వల్ల మన బిల్లు ఆదా అవటమే కాకుండా, ఇతరులకూ ఇబ్బంది కలుగదు.

దూర ప్రాంతాలకు మట్లాడినపుడు కొందరు అవతల వ్యక్తి అడుగక ముందే గట్టిగా మాట్లాడుతుంటారు. 
వినపడటం లేదు. 
గట్టిగా మాట్లాడండి.

I can’t hear.

Please, speak aloud,

A bit louder, Please అంటే తప్ప మీరు అరవాల్సిన అవసరం లేదు.  ఇప్పుడు Electronic Telephone Exchanges అంతటా ఉన్నాయి.  కాబట్టి మన వాయిస్ క్లియర్ గానే వినిపిస్తుంది. 

ఎవరైనా బెదిరిస్తే....

Mind your tongue.  I have to give / lodge a complaint
నేను కంప్లయింట్ ఇవ్వాల్సి ఉంటుందని మీరు బెదిరించండి.
ప్రేమ పిచ్చితో మట్లాడితే, అది మీకు నచ్చకపోతే

I am not interested అనీ,
Consequences will be serious అని వార్నింగ్ ఇవ్వండి.

పెద్దవాళ్ళు, ఊహించని వాళ్ళు ఫోన్ చేస్తే –
Thanks for calling
Thank you very much
Thanks a lot
Thanks for your concern
Have a good day
Very kind of you, Sir

అని అంటే ఫోన్ చేసిన వాళ్ళు సంతోషపడతారు.

ఇక నుండి ఫోన్ లో మాట్లాడినపుడు ఈ మానర్స్ అన్నీ పాటిస్తారు కదూ ?
So, Happy chatting on Phone.  Bye…!!

0 Responses to ఫోన్ లో ఇంగ్లీష్

Post a Comment

Search by letter for Glossory

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ‘క్లిక్’ చేయండి.

IM-Smiley.com IM-Smiley.com

సుమణీ వెంకట్ ఇంగ్లీష్ - ఆణిముత్యాలు

Loading...
సాంకేతిక సహాయంతో తయారు చేయు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు విద్యార్ధులకు సులభంగా అర్థం కాగలవు ప్రత్యేకంగా..విద్యార్థులు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలుశుభం.

Category Menu

Protected by Copyscape DMCA Plagiarism Scanner

మీ ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి

Bookmark and Share

Subscribe in a reader

Add to Google Reader or Homepage

Powered by FeedBurner

Followers

వీటిలో సభ్యత్వం

www.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.wswww.bigoo.ws

test test test

About Us

My Photo
Sumani's English
I am a simple
View my complete profile

Pages

feeds , comments