ఎదుటి వాళ్ళు అడిగే ఇంగ్లీష్ ప్రశ్నలకు మీరు ఇంగ్లీష్ లోనే సమాధానం ఇవ్వవచ్చు. మనకు ఇంగ్లీష్ లో తప్పులు చేస్తామనే బిడియం ఉన్నప్పుడు, ముక్తసరిగా సమాధానాలను ఇస్తుంటాము.
ఈ సమాధానాలను ఎన్ని రకాలుగా ఇవ్వవచ్చో చూద్దామా ?
మీరు ప్రతి రోజు వార్తా పత్రికను చదువుతారా ?
Do you read the newspaper daily ? అని అడిగినప్పుడు ‘అవును ’ అనే సమాధానాలను నాలుగు రకాలుగా ఇలా ఇవ్వవచ్చు.
1. Yes అనీ,
2. Yes, I do అనీ,
3. Yes, I read the newspaper అనీ,
4. Yes, I do read the newspaper అనీ అనవచ్చు.
నొక్కి వక్కాణించినప్పుడు I do read the newspaper అని అంటాం
ప్రతిరోజు వార్తాపత్రికను చదువను అన్నప్పుడు
1. No, అని కానీ,
2. No, I don’t అని కానీ,
3. No, I don’t read the newspaper అని కానీ,
4. No, I do not read the newspaper అని కానీ అంటాం.
సాధారణంగా సంభాషణలో వినసొంపుగా ఉండటానికి, త్వరగా మాట్లాడటానికి,
Is not బదులుగా isn’t (ఈజింట్) అనీ,
Was not బదులుగా wasn’t (వజంట్) అనీ,
Are not బదులుగా aren’t (ఆంట్) అనీ (ఆరంట్ అనకండి.)
Were not బదులుగా weren’t (వరంట్) అనీ,
Do not బదులుగా don’t (డోంట్) అనీ,
Does not బదులుగా doesn’t (డజంట్) అనీ,
Did not బదులుగా didn’t (డిడింట్) అనీ (డింట్ అనకండి.)
Cannot బదులుగా can’t (కాంట్) అనీ ( Single ‘n’ను గమనించారా ? )
Could not బదులుగా couldn’t (కుడుంట్) అనీ (కుంట్ అనకండి.)
Shall not బదులుగా shan’t (షాంట్) అనీ,
Should not బదులుగా shouldn’t (షుడుంట్) అనీ,
Will not బదులుగా won’t (వొంట్) అనీ (వాంట్ అనకండి.)
Would not బదులుగా wouldn’t (వుడుంట్) అనీ,
He has బదులుగా He’s (ఈజ్) అనీ,
She has బదులుగా She’s (షీజ్) అనీ,
He will బదులుగా He’ll (ఈల్) అనీ,
Contracted లేదా shortened forms ని వాడుతుంటాం. ఇదే స్పోకన్ ఇంగ్లీష్ లో ఉన్న ఒక ప్రత్యేకత.
సహాయక క్రియలని (Helping Verbs) స్పష్టంగా సదా ఉచ్చరించాలని అనుకోకండి. నొక్కి వక్కాణించినప్పుడే వాటిని స్పష్టంగా పలుకుతాం.
It’s working (ఇట్స్ వర్కింగ్) లో ఉన్న అందం –
It is working (ఇట్ ఈజ్ వర్కింగ్) అని అనటంలో ఉండదు.
అలాగే I’ll come (ఐల్ కం) లో వున్న వినసొంపు –
I shall / will come (ఐ షల్ / విల్ కం ) లో ఉండదు.
ఇంటర్వూలలో సామాధానాలను ఇచ్చేటప్పుడు, ఇంగ్లీష్ లో ఇతరులతో సంభాషించేటప్పుడు, త్వరగా మాట్లాడడానికి, వినసొంపుగా ఉండటానికి ఈ కింది విధంగా అంటాం.
I don’t know (ఐ డోంట్ నో)
It can’t be done (ఇట్ కాంట్ బి డన్)
He won’t come (ఇ వోంట్ కం)
He will not come (ఇ విల్ నాట్ కం) అంటాము.
అంటే మీకు ఖచ్చితంగా తెలుసు అతను రాడని.
అతను బహుశ రాకపోవచ్చు ....అంటే....
Perhaps, he may not come (పర్ హోప్స్, ఇ మే నాట్ కం) అని అనవచ్చు.
జరిగిన పనులకు మనం సాధారణంగా past tense ను వాడి –
1) He came yesterday అనీ,
2) She spoke to me అనీ,
3) They played very well అనీ,
4) We visited Tirupathi for Sankranthi అనీ,
5) I wrote a letter last week అనీ,
6) You gave a chance to him అనీ,
7) Venkat saw the film అనీ,
8) Lakshmi left the place in a hurry అనీ,
9) I told him అనీ అంటాం.
ఎదుటి వ్యక్తి నమ్మనప్పుడు, తప్పక ఆ పనులు జరిగాయి అని బల్లగుద్ది చెప్పినపుడు –
1) He did come (came కాదు) yesterday అనీ,
2) She did speak (spoke కాదు ) to me అనీ,
3) They did play very well అనీ,
4) We did visit Tirupathi for Sankranthi అనీ,
5) I did write (wrote కాదు) a letter last week అనీ,
6) You did give (gave కాదు) a chance to him, but not to me – నాకు కాక ఆయనకు మీరు అవకాశం ఇచ్చారనీ,
7) Venkat did see (saw కాదు) the film అనీ,
8) Lakshmi did leave (not left) the place in a hurry – లక్ష్మి తొందరగా స్థలాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయిందనీ,
9) I did tell (not told) him అనీ అంటాం.
పై వాక్యాలను మీరు Present Tense లో వాడదలచుకుంటే did బదులుగా మీరు do కానీ, does కాని వాడాల్సి ఉంటుంది.
I, we, you, they తర్వాత do ను వాడతాం. He, She, It ల తర్వాత does ను వాడతాం.
1) He does come now (not do) అనీ,
2) She does speak (not do) అనీ,
3) They do play very well (not does) అనీ,
4) We do visit the place again (not does) అనీ,
5) I do give replies in time – సమయానికి తప్పక ప్రత్యుత్తరాలు ఇస్తాననీ,
6) I did write (wrote కాదు) a letter last week అనీ,
7) You do give a chance to him, not to me – అతనికే అవకాశం ఇవ్వండి, నాకు కాదనీ,
8) Venkat does see all films అనీ,
9) Lakshmi does everything in a hurry అనీ,
10) I do tell you now అనీ అంటాం.
REST IN NEXT……!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to రకరకాల సమాధానాలు