మిత్రులారా....!!
హితులారా....!!
ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా....!!
విషయం పాతదే.
అయితే ఇది గ్రామటికల్ గా సొగసుగా వర్ణించవచ్చును.
ఇది ఒక వ్యాకరణ పరమైన అర్థం.
N E W - N E W S
న్యూస్ (NEWS) అంటే తెలుగులో ‘వార్తలు’ అని చెప్పుకుంటున్నాం.
‘న్యూ’ (NEW) అనేది ఏకవచనం.
దాని బహువచన రూపమే ‘న్యూస్ ’.
14 వ శతాబ్ధంలో ఈ ‘న్యూ’ ‘న్యూస్ ’ గా స్థిరపడింది.
ఫ్రెంచ్ భాషాపదం ‘నౌవెల్లెస్ ’ (Nouvelles) నుంచి దీనిని ఇంగ్లీష్ లోనికి తీసుకున్నారు.
‘న్యూ’ అంటే ‘‘కొత్తది’’ అని అర్థం.
అది ఏదైనా కావచ్చు.
కాలక్రమేణా
ఇది వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా
ప్రస్తుత పరిస్థితులు / విషయాలపై
సమాచారాన్ని అందించే ప్రక్రియకి
ఒక పేరుగా స్థిరపడింది.
‘న్యూస్ ’ రేడియో ద్వారా గాని,
ముద్రణా రంగం అంటే పత్రికల ద్వారా కాని,
టెలివిజన్, అంతర్జాలము (Internet) వగైరా
మాధ్యమాలలో
అందరికీ అందుబాటులో ఉండేదని చెప్పవచ్చు.
కొంత మంది అనుకున్నట్లు
ఇది ఇంగ్లీష్ అక్షరాలు
N = North (ఉత్తరం),
E = East (తూర్పు),
W = West (పడమర),
S = South (దక్షిణం) వెరసి
N + E + W + S = N E W S
ప్రపంచం నలు మూలల నుంచి వార్తలను ఒక చోట చేర్చేది మాత్రం కాదు.
ఇదండీ సంగతి.
REST IN NEXT....!!
0 Responses to ‘న్యూ’ అనేది ఏకవచనం. దాని బహువచన రూపమే ‘న్యూస్