అపరిచిత వ్యక్తిని ఆఫీసులో disturb చేసినపుడు –
Excuse me అనీ
I am Venkat అని కానీ,
My Name is Venkat అని కానీ
నా పేరును చెపుతాను. నేను విజయవాడ నుంచి వచ్చాను అన్నప్పుడు –
I am from Vijayawada, లేదా
I come from Vijayawada, లేదా
I hail from Vijayawada, లేదా
I belong to Vijayawada అని అంటాము.
గమనించండి : I am come from Vijayawada అని అంటే తప్పవుతుంది. ‘am’ వచ్చినప్పుడు ‘come’ రాదు.
I am coming from Vijayawada అంటే ప్రస్తుతం నేను విజయవాడా నుండి వస్తున్నాను అని అర్థం. ఈ వాక్యం చివరన now అనే పదాన్ని వాడవచ్చు. నా మిత్రుడు ప్రతిరోజూ హైదరాబాదు నుండి విజయవాడకు పనిచేయటానికి వస్తాడంటే –
My friend commutes from Hyderabad to Vijayawada daily లేదా every day అని అంటాం.
నా జన్మస్థానం పోరంకి గ్రామమని చెప్పాలనుకుంటే
My Native village is Poranki అనీ,
ఆ గ్రామం ఎక్కడ ఉందని మీరడగదలిస్తే –
Where is Poranki ? అనీ,
పోరంకి గ్రామ పంచాయితీ, కృష్ణాజిల్లా లో ఉంటే –
It’s in Poranking Gram Panchayat, Krishna District అనీ,
అది విజయవాడ సిటీకి ఎంత దూరంలో ఉంటుంది అని అడిగినపుడు –
How far is it away from Vijayawada City ? అని అంటాం.
విజయవాడ సిటీకి దాదాపు పదికిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనడానికి
It’s 10 Kms. Away from Vijayawada City అని అంటాం.
నా మిత్రుడు టెక్నికల్ కోర్సును పూర్తి చేసినపుడు –
My friend has done a technical course అనీ, చేస్తూ ఉంటే – కాలేజి ముందు ‘at’ ను వాడి
He is doing some diploma at Vijayawada Polytechnic College అనీ అంటాం.
చదువుకున్న వ్యక్తి ఉదాహరణకు 1990 లో MA English పూర్తి చేస్తే –
He did MA English in 1990 అని అంటాం.
గమనించండి : సంవత్సరాన్ని సూచించినపుడు.....
He has done MA English in 1990 అనకుండా
He did MA English in 1990 అనాలి.
Already, just, never, yet, recently మొదలైన adverbs తో has done ను వాడతాం.
He has already done MA English – అంటే ఇంతకు ముందే ఎం.ఎ. ఇంగ్లీష్ చేశాడనీ,
He has recently done MA English – అంటే ఈ మధ్యనే ఎం.ఎ. ఇంగ్లీష్ చేశాడనీ,
He has just done it, ఇప్పుడే దానిని పూర్తి చేశాడనీ,
He has never done it, అంటే ఇంతవరకు చేయలేదనీ,
He has not yet done it, అంటే ఇంతవరకు ఇంకా పూర్తి చేయలేదనీ (negative sense లో yet ను) వాడతాం.
REST IN NEXT…..!!
Sumani's English
SUMANI'S ENGLISH
SUMANI'S ENGLISH
0 Responses to మనల్ని మనం పరిచయం చేసుకోవటమెలా ?